
బలవంతపు భూసేకరణ సరికాదు
నారాయణపేట టౌన్: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా బలవంతపు భూ సేకరణ సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ పార్క్ వద్ద రైతులు చేసిన ధర్నాకు మద్దతు ప్రకటించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీపూర్, బాపూర్, ఊట్కూర్ ప్రాంతంలోని కొందరు రైతులకు భూ పరిహారం కింద ఎకరాకు రూ.14 లక్షలు మంజూరు చేసి, ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా భూముల బేసిక్ ధరను నిర్ణయించడానికి ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.