టీపీసీసీలో మనోళ్లు | - | Sakshi
Sakshi News home page

టీపీసీసీలో మనోళ్లు

Jun 10 2025 3:38 AM | Updated on Jun 10 2025 3:38 AM

టీపీస

టీపీసీసీలో మనోళ్లు

ఉమ్మడి పాలమూరు నుంచి ఆరుగురికి చోటు

ఉపాధ్యక్షుడిగా

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

ప్రధాన కార్యదర్శులుగా ‘పేట’ ఎమ్మెల్యే పర్ణికారెడ్డితోపాటు మరో నలుగురు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: టీపీసీసీ కార్యవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామక జాబితాను సోమవారం ఏఐసీసీ విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు నాయకులకు చోటు దక్కింది. గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, ఐదుగురు ప్రధాన కార్యదర్శులుగా ఉండగా.. ఈసారి ఆరుగురికి కార్యవర్గంలో చోటు కల్పించారు.

కార్యవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు

రాష్ట్రవ్యాప్తంగా టీపీసీసీ ఉపాధ్యక్షులుగా 27 మందిని ఎంపిక చేయగా వీరిలో ఉపాధ్యక్షుడిగా అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్‌ డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ నియమితులయ్యారు. అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా 69 మందితో జాబితా ప్రకటించగా ఉమ్మడి జిల్లా నుంచి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన సంజీవ్‌ ముదిరాజ్‌, ఏపీ మిథున్‌రెడ్డి, గద్వాల నియోజకవర్గానికి చెందిన యువజన కాంగ్రెస్‌లో పనిచేసిన ఎం.రాజీవ్‌రెడ్డి, వనపర్తి నియోజకవర్గానికి చెందిన నందిమల్ల యాదయ్య ముదిరాజ్‌లను ఎంపిక చేశారు. వీరిలో సంజీవ్‌ ముదిరాజ్‌ ప్రస్తుత కార్యవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండగా మళ్లీ అదే పదవిని కట్టబెట్టారు.

కార్యకర్తల్లో హుషారు

టీపీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేయడంపై కాంగ్రెస్‌ కార్యకర్తల్లో హుషారు నింపింది. ఇప్పటికే మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించగా.. టీపీసీసీ కార్యవ ర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు నాయకులకు చోటు దక్కడంతో కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే డీసీసీ అధ్యక్షుల ఎంపిక?

టీపీసీసీ కార్యవర్గాన్ని నియమించడంతో త్వరలోనే డీసీసీ అధ్యక్షులు, ఇతర కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులు మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవుల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మరో వారంలో రోజుల్లో పూర్తిస్థాయిలో డీసీసీ కార్యవర్గాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

టీపీసీసీలో మనోళ్లు 1
1/1

టీపీసీసీలో మనోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement