
చిరుతను బంధిస్తాం
కోయిల్‌కొండ: మండల కేంద్రంలోని ఫింజర్‌గుట్టపై వారం రోజులుగా చిరుత సంచరిస్తుండటంతో సోమవారం అటవీ శాఖ అధికారులు డీఆర్‌ఓ రాజశేఖర్, రాఘవేందర్‌రెడ్డి, ఉమేష్ కొండపై చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుత సంచారంతో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సూచించారు. చిరుతను బంధించేందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని బోను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఫ్రిజ్ సిలిండర్ పేలి
అగ్ని ప్రమాదం
మక్తల్: ఫ్రిజ్ సిలండర్ పేలి అగ్ని ప్రమాదం మక్తల్ పట్టణంలో సంగంబండ రోడ్డు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. మక్తల్‌లో ఆనంద్‌బాబు ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నాలుగు రోజుల నుంచి ఇల్లు తాళం వేసి సొంత ఊరుకు వెళ్లాడు. ఇటీవల కరెంటు సరఫరా ఎక్కువ, తక్కువ కావ డంతో ఫ్రిజ్ సిలిండ్ పేలి పెద్దగా పొగలు వచ్చాయి. దీంతో పక్కింటి వారు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్ర మాదం తప్పింది.
సమస్యలు పరిష్కరించాలని రైతుల ఆందోళన
మద్దూరు: మద్దూరు మండలాన్ని భూ భారతిలో ఫైలెట్ మండలంగా ఎంపిక చేశారు. అయినా మా భూ సమస్యలను పరిష్కరిచండం లేదని రెనివట్ల గ్రామానికి చెందిన రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అంతకుముందే నారాయణపేట కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రెనివట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 319, 320, 359, 360, 210, 546, 565లో 66 ఎకరాల 11గుంటల ఇనాం భూమి ఉందన్నారు. ఈ భూమి చిన్నయ్య, మ ల్లప్ప, బాలప్ప, వెంకటప్ప పేర్ల మీద నాలుగు పెద్ద బాగాలున్నట్లు తెలిపారు. వారి వారసుల్లో కొంత మంది భూములు అమ్ముకొని వెళ్లిపోయారు. కానీ రికార్డుల్లో వారి పేర్లే ఉన్నాయి. ఈ సర్వే నంబర్ల భూమి ఇనామ్ రద్దు చేసి మాకు ఓఆర్‌సీ ఇచ్చి భాగ పరిష్కారం చేయాలన్నారు. భూ భారతిలో పెట్టుకు న్న అధికారులు స్పందించడం లేదని ఆందోళన చేపట్టారు. ఈ భూముల వ్యవహారంలో అధికారులకు ముడుపులు ముట్టజెప్పిన పనులు కావడం లేదని రైతులు ఆరోపించారు. కొత్త చట్టం ద్వారా మా సమస్య పరిష్కారం చేయాలని ఆందోళన చేపట్టినట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ మహేష్‌గౌడ్ రైతులు సమస్యను విని రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలన్నారు. పాత రికార్డులను పరిశీలించి, పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కొత్త ఆశప్ప, చిట్టి కన్కప్ప, జగన్, చిన్న కేవప్ప, హన్మంతు, బోడ శ్రీనివాస్, డబ్బ అశోక్, రాసం కన్కప్ప, చెవుల మోహన్, సాయమ్మ, ప్రమీల, మొగులప్ప, లక్ష్మి, గోవిందు, శేఖర్, నీలప్ప, భీమప్ప ఉన్నారు.
కందూర్‌లో గొర్రెల చోరీ
అడ్డాకుల: మండలంలోని కందూర్‌లో 20 గొర్రెలు చోరీకి గురైనట్లు ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలయ్య, రమేష్, రవి కలిసి ఆదివారం మహబూబ్‌నగర్ మండలంలోని జమిస్తాపూర్‌లో 60 గొర్రెలను కొనుగోలు చేసి కందూర్‌కు తీసుకొచ్చారు. వాటిని రాత్రి బాలయ్య ఇంటి వద్ద ఉంచారు. వాటికి కొంత దూరంలోనే కాపలా ఉన్నారు. వర్షం రావడంతో సమీపంలో ఉన్న కిరాణం షాపు వద్దకు వెళ్లి అక్కడే ఉన్నారు. అయితే ఉదయం లేచి చూస్తే 40 గొర్రెలు మాత్రమే ఉండటంతో 20 గొర్రెలు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చిరుతను బంధిస్తాం