
అక్షయ తృతీయ సందడి
స్టేషన్ మహబూబ్‌నగర్: అక్షయ తృతీయను పురస్కరించుకొని బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బంగారం విక్రయ కేంద్రాల్లో సందడి నెలకొంది. ఈ రోజున కొంతైనా బంగారం కొనుగోలు చేస్తే వారింట్లో ధనలక్ష్మి కొలువుంటుందన్న విశ్వాసం ప్రజల్లో ఉండడంతో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తకోట, కోస్గి పట్టణాలో బంగారం దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. సూర్యుడు భగభగలాడుతున్నప్పటికీ తమకు నచ్చిన రీతిలో బంగారం, వెండి వస్తువులు కొనడానికి వచ్చారు. మామూలు రోజుల కంటే అక్షయ తృతీయ కావడంతో కొంతమేర విక్రయాలు అధికంగా జరిగినట్లు తెలుస్తోంది.