అలంపూర్ రూరల్: దేశానికి రైతులు వెన్నెముక అని అంటున్నారు కానీ గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల సమస్యలు ప్రభుత్వాలకు పట్టడం లేదని పొగాకు రైతుల అవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను దగా చేయకండని బొమ్మిడాల పొగాకు కంపెనీ యాజమాన్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలంపూర్ మండల పరిధిలోని కోనేరు గ్రామ శివారులోని బొమ్మిడాల కంపెనీ యాజమాన్యంపై పొగాకు చెక్కులకు సరైన ధరను కల్పించకుండా, తెచ్చిన చెక్కులను కనీసం చూడకుండా సీఆర్ చేస్తున్నారని పొగాకు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కులకు సరైన ధర కల్పించి న్యాయం చేయాలని కోరారు. గ్రామాల్లో ఎఫ్‌టీ పరిశీలించి సరుకును తీసుకురమ్మరని, తీరా కంపెనీ వద్దకు తెస్తే సరుకు నాణ్యత లేదని సీఆర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, కంపెనీ అగ్రిమెంట్ ప్రకారం రూ.15,500 ధర కల్పించాల్సి ఉండగా రూ.8 వేలు, 10 వేలు, 12 వేలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తట్లు వారే ఇచ్చి.. వారే కట్టుకురమ్మని రైతులను ఇబ్బందులు పెడుతున్నట్లు వాపోయారు. 30 మంది రైతుల సరుకును సగం ధరకు కూడా తీసుకోకుండా సీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొమ్మిడాల కంపెనీ యాజమాన్యంపై
పొగాకు రైతుల ఆగ్రహం