
● 25న కొల్లాపూర్, 26న మక్తల్‌లో బహిరంగసభలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం కొల్లాపూర్, ఆదివారం మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం 11.20 గంటలకు హెలీకాప్టర్ ద్వారా కొల్లాపూర్ చేరుకొని 11.30 గంటలకు పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మునుగోడు ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత ఆదివారం ఉదయం 11.20 గంటలకు హెలీకాప్టర్ ద్వారా మక్తల్‌కు వచ్చి.. 11.30 గంటలకు మక్తల్‌లో నిర్వహించనున్న పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొని.. మధ్యాహ్నం 12.20 గంటలకు ములుగు ఎన్నికల ప్రచారానికి వెళ్తారు.
26న సీనియర్ మహిళా కబడ్డీ జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈ నెల 26న జిల్లా సీనియర్ మహిళా కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాంతికుమార్, కురుమూర్తిగౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 ఎంపికలు జరుగుతాయని, క్రీడాకారిణులు ఒరిజినల్ ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు ఫొటోలతో హాజరుకావాలని కోరారు. ఎంపికై న జట్టు నిజామాబాద్ జిల్లా బుసాపూర్‌లో వచ్చే నెల 4 నుంచి 6 వరకు జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొంటుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్ నం.97049 34663ను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment