
మా వీధిలోని ఓపెన్ ప్లాటు మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది. దానిచుట్టూ ఉన్న ఓపెన్ నాలాలు అపరిశుభ్రంగా మారాయి. ముఖ్యంగా దోమలకు ఆవాసంగా తయారైంది. అసలే వర్షాకాలం.. ఆపై సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. మా కాంపౌండ్‌లోని ఐదు కుటుంబాల్లో సుమారు పది మంది చిన్నపిల్లలు ఉంటారు. బయటకు పంపించాలంటేనే భయమేస్తుంది. ఎక్కడ డెంగీ, విష జ్వరాలు సోకుతాయోనని ఆందోళనగా ఉంది. మున్సిపల్ అధికారులు స్పందించి తరచూ ఫాగింగ్‌తో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఎప్పటికప్పుడు మోరీలను శుభ్రం చేయాలి.
– కవిత, ప్రైవేట్ ఉపాధ్యాయిని, లక్ష్మీనగర్‌కాలనీ, మహబూబ్‌నగర్