తాళ్లచెరువు కట్ట మీదనే భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శనివారం వనపర్తి పరిధిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని అనుకున్నారు. అనివార్య కారణాలతో ఇది వాయిదా పడగా.. రంజాన్ నేపథ్యంలో ఈ ప్రాంతంలోనే ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడే సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి చెక్కులు సైతం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ తాళ్లచెరువు కట్టపైనే నిర్వహించాలని తలపెట్టిన క్రమంలో సమాధుల అంశం తెరపైకి వచ్చింది. సమాధుల ఆనవాళ్లే లేకుండా పోయాయని.. ఇక్కడ అందరూ ఎస్సీలు, బీసీలేనని.. అందరికి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించి తమ విశ్వాసాలను దెబ్బతీయడం ఎంత వరకు సమంజసమో నేతలు, అధికారులు స్పష్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కట్టుకునే అవకాశం కల్పి స్తామని చెప్పారని.. పాలకులు తమ హామీని నిలబెట్టుకోవాలని కొందరు కోరుతున్నారు.
విమర్శల వెల్లువ..
ఎస్టిమేషన్ లేకుండానే తాళ్లచెరువు ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులు చేపట్టారు. 2021 ఆగస్టులో పనులు ప్రారంభం కాగా.. గతేడాది ఫిబ్ర వరిలో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ తర్వాతే పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. ఇలా నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సమాధులపై రోడ్డు వేసి బీసీల, ఎస్సీల మనోభావాలు దెబ్బతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎలాంటి అభ్యంతరాలు రాలేదు
తాళ్లచెరువు కట్ట బ్యూటిఫికేషన్, సీసీరోడ్డు ని ర్మాణం సమయంలో సమాధులపై మట్టివేసే క్రమంలో ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఏ ళ్లుగా తుమ్మలు మొలిచిన కట్టను రెండు ప్రధాన రోడ్లకు లింక్ చేస్తూ.. ప్రయాణం సులభతరం చేయాలనే సదుద్దేశంతో పనులు చేశాం. సమాధులు తొలగించలేదు. మట్టికిందనే ఉన్నాయి.
– భరత్, ఏఈ, నీటిపారుదలశాఖ, వనపర్తి
●