
ఖిల్లాఘనపురం: రైతులు ఆధునిక పద్ధతులతో సుస్థిర వ్యవసాయం చేయడం వలన ఆర్థిక అభివృద్ధి సాధిస్తారని పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రగతి, లక్ష్మణ్, ప్రియాంక, పరిమళ కుమార్, ఏడీఏ సత్యంబాబు తెలిపారు. శుక్రవారం మండలంలోని కమాలోద్ధీన్‌పూర్‌లో క్లస్టర్ రైతువేదికలో రైతులకు సుస్థిర వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు ఉన్న భూమిలో ఒకే రకం పంటను సాగు చేయకుండా అన్ని రకాల పంటలు, కోళ్లు, గేదెలు, పండ్ల మొక్కలు సాగు చేయడంతో ఎప్పుడూ నష్టపోరని తెలిపారు. మారుతున్న పద్ధతులను అనుసరిస్తు ఆధునిక వ్యవసాయ పరికరాలను ఉపయోగించాలన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగు చేయడం వలన మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మల్లయ్య, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.