జాతర విధుల్లో పాల్గొనే సిబ్బందిపై పర్యవేక్షణ
హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో విధులు నిర్వర్తించే సిబ్బందిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ అన్నారు. సోమవారం వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని అన్ని డిపోలకు చెందిన సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్లకు ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై దిశానిర్దేశం చేశారు. జాతరలో భక్తుల రద్దీ దృష్ట్యా సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, సెఫ్టీ వార్డెన్లు కీలక పాత్ర పోషించాలన్నారు. జాతరలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.ణ ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా, క్రమశిక్షణ తో వ్యవహరించేలా సిబ్బందికి అవగాహన కల్పించాలనిన్నారు. మద్యం సేవించి విధులకు హాజరు కాకుండా, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ ఆర్‌ఎంలు పి.మహేశ్, కేశరాజు భాను కిరణ్, ఏటీఎం ఎం.మల్లేశయ్య,డిపో మేనేజర్లు పి.అర్పిత, రవిచంద్ర, పర్సనల్ ఆఫీసర్ పి.సైదులు పాల్గొన్నారు.
టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్


