ఉర్దూ భాషాభివృద్ధికి కాన్ఫరెన్స్ కొత్త ఒరవడి
● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి
న్యూశాయంపేట : ఉర్దూ భాష కేవలం ఒక వర్గానికి పరిమితం కాదని, భారతదేశంలో పుట్టిన భాష అని, ఉర్దూ భాషాభివృద్ధికి వరంగల్‌లో నిర్వహించిన స్టేట్ కాన్ఫరెన్స్ కొత్త ఒరవడి సృష్టిస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం వరంగల్‌లోని క్రిష్టల్ గార్డెన్‌లో తెలంగాణ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఖ్వాజా ఖుత్బుద్దీన్ అధ్యక్షతన నిర్వహింస్టేట్ ఉర్దూ కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీ, స్పెషల్ డీఎస్సీ, ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మరో అతిథి రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా మాట్లాడుతూ ఉర్దూ భాష బలోపేతానికి యువత కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఉర్దూ భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. ఈ సందర్బంగా మరో అతిథి రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారఖ్ అన్సారీ చేతుల మీదుగా ఉర్దూ భాషాభివృద్ధ్ధికి విశేష కృషిచేసిన ప్రముఖులకు సర్టిఫికెట్లు, మెమోంటోలు ప్రదానం చేశారు. ఈ సదస్సులో డాక్టర్ అనీస్ సిద్దిఖీ, డాక్టర్ బహుదూర్‌అలీ, మీర్ కౌకబ్‌అలీ, రాష్ట్ర ప్రఽ దాన కార్యదర్శి తాహెర్ షకీల్ అహ్మద్, ఖ్వాజా జహీరుద్దీన్, జిల్లా నాయకులు ఇ క్బాల్, ఖ్వాజా ఫరీద్దీన్, ముజాహిద్ అలీ, ఇనాయతుల్లా ఖాన్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడు రవి సస్పెన్షన్
మహబూబాబాద్ అర్బన్ : విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు జెడ్పీహెచ్‌ఎస్ సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయుడు రవిని సస్పెండ్ చేస్తున్నట్లు డీ ఈఓ పి. దక్షణమూర్తి శనివారం తెలిపారు. పాఠశాలలో టౌన్ సీఐ మహేందర్‌రెడ్డి, ఎంఈఓ వెంకటేశ్వ ర్లు సహకారంతో విచారణ జరి పామన్నారు. ఇందులో విద్యార్థినుల పట్ల రవి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు రుజువు అయిందన్నారు. ఆ నివేదికను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, కలెక్టర్‌కు అందజేశామన్నారు. వారి ఆదేశాల మేరకు రవిని సస్పెండ్ చేశామని డీఈఓ పేర్కొన్నారు.


