18న జాబ్‌మేళా
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 18న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య తెలిపారు. హనుమకొండ ములుగు రోడ్‌లోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. హనుమకొండ అపోలో ఫార్మసీ కంపెనీలో 10 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 18 నుంచి 26 సంవత్సరాల వయసు కలిగి ఉండి ఏదేని డిగ్రీతోపాటు, బీ ఫార్మసీ, డీ ఫార్మ్, ఎం.ఫార్మసీలో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. వేతనం రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జాబ్‌మేళా ప్రారంభమవుతుందని, వివరాలకు 7893394393 సెల్ నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.
లారీపై ఉన్న
టార్పాలిన్ తీస్తూ..
● కిందపడి అక్కడికక్కడే డ్రైవర్ మృతి
● పర్వతగిరి మార్కెట్‌లో ఘటన
పర్వతగిరి: లారీపై ఉన్న టార్పాలిన్ తీస్తున్న క్రమంలో కింద పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మండలం కేంద్రలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... పర్వతగిరి మార్కెట్‌కు మండలంలోని ఏనుగల్లు మారుతి ఇండస్ట్రీస్ నుంచి బియ్యం లోడ్‌తో ఓ లారీ వచ్చింది. ఆ లారీపై ఉన్న టార్పాలిన్ తీస్తున్న క్రమంలో డ్రైవర్ ఎగ్గే మల్లేషం(55) ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్ తోట. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజగోపాల్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.


