నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వీసీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మహబూబాబాద్: తుపాన్ ప్రభావంతో పంటలకు నష్టం జరగకుండా రైతులు జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కలిసి అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండానే వెంటనే పరిష్కరించాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా జెడ్పీ సీఈఓ పురుషోత్తం, ఆర్డీఓ కృష్ణవేణి దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం చేసే విధంగా లేకపోతే వివరాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో 104 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తూకంలో మోసాలు చేస్తే చర్యలు తీసుకుంటాం
గూడూరు: వ్యాపారులు, దళారులు తూకంలో మోసాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తూనికలు, కొలతల జిల్లా అధికారి శ్రీలత హెచ్చరించారు. మండల కేంద్రంలోని శ్రీరామ వేబ్రిడ్జి తూకంలో తక్కువగా చూపుతుందనే పలువురు వ్యాపారులు, రైతుల ఫిర్యాదు మేరకు సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వే బ్రిడ్జిపై లారీతో తూకం పరిశీలించగా, 30 టన్నులకు సుమారు 6 క్వింటాళ్ల 50 కిలోలు తక్కువగా చూపుతుందని గుర్తించారు. దీంతో వెంటనే ఆ వే బ్రిడ్జి నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి, సరిచూసుకోవాలని అన్నారు. వే బ్రిడ్జిలే కాకుండా కిరాణా, ఇతర షాపుల వద్ద తూకాల్లో తేడాలను గుర్తించి వెంటనే ఫిర్యాదు చేయాలని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఏఎంసీ కార్యదర్శిగా సుజన్‌బాబు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్–1 కార్యదర్శి (పూర్తి అదనపు బాధ్యతలు) గా వి.సుజన్‌బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ గ్రేడ్–1 కార్యదర్శిగా సుజన్ బాబు విధులు నిర్వర్తిస్తుండగా.. ఆయనను మార్కెటింగ్‌శాఖ ఉన్నత అధికారులు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
టీబీని ముందస్తుగా
గుర్తించాలి
నెహ్రూ సెంటర్: టీబీ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా నయం చేయవచ్చని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ అన్నారు. టీబీ నిర్ధారణ పరీక్షల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. మానుకోటను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి విజయ్‌కుమార్, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి


