మానుకోట రూపురేఖలు మారుతాయి
● సీఎం ఆశీస్సులతో రూ 59.62 కోట్లు
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో మానుకోట మున్సిపాలిటీకి రూ 59.62 కోట్లు విడుదల అయ్యాయని, ఆ నిధులతో పట్టణ రూపురేఖ లు మారుతాయని ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ అన్నారు. నిధులు విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాంనాయక్ ఫ్లెక్సీకి ఎమ్మెల్యే, నాయకులు పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి సంబురాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. విడుదలైన నిధులతో ఇండోర్ స్టేడియం పార్క్‌లో రోడ్లు, డ్రైయినేజీలు లాంటి పనులు చేపడుతామన్నారు. ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కృషి చేస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. మానుకోటలో నీటి సమస్య పరిష్కారానికి రూ.20 కోట్లతో పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఘనపురపు అంజయ్య, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు,, ఖలీల్, ఎడ్ల రమేశ్, లక్ష్మీనారాయణ, రామగోని రాజు, గిరిధర్‌గుప్తా, నాళ్ల నర్సింహారావు, పోతురాజు, దేవరం ప్రకాశ్‌రెడ్డి, బి.రాజు, నీరుటి సురేశ్, ఆకుల శ్రీను, ఉపేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


