శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం | - | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం

Oct 28 2025 8:48 AM | Updated on Oct 28 2025 8:48 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం

హన్మకొండ : హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ప్రతీరోజు హనుమకొండ జిల్లా బస్‌ స్టేషన్‌ నుంచి సాయంత్రం 4గంటలకు బయలుదేరి రాత్రి 7:30గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది. తిరిగి ఉదయం 5గంటలకు ఎయిర్‌పోర్ట్‌లో బయలుదేరి ఉప్పల్‌ మీదుగా హనుమకొండ, భూపాలపల్లికి వెళ్తుంది. హనుమకొండ–శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చార్జీ రూ.700 లుగా నిర్ణయించారు. ఈ బస్సును సోమవారం ప్రారంభించినట్లు వరంగల్‌–1 డిపో మేనేజర్‌ అర్పిత తెలిపారు. ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement