జంపన్న వాగు బావుల్లో పూడికతీత ప్రారంభం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జంపన్నవాగులోని ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లో ఇరిగేషన్‌శాఖ అధికారులు సోమవారం పూడితీత పనులు ప్రారంభించారు. జాతర సమయంలో భక్తుల తాగునీటి సౌకర్యార్థం వాగులోని బావుల నుంచి నీటి సరఫరా చేస్తారు. ఏటా వర్షాలకు జంపన్నవాగు వరద ఉధృతికి బావులు ఇసుక, చెత్తతో నిండిపోతుంటాయి. దీంతో ప్రతీ మహాజాతరలో కార్మికులతో బావుల్లో పూడిక తీయిస్తుంటారు. ఈసారి త్వరితగతిన పూర్తి చేయాలనే ఆలోచన మేరకు డ్రెడ్జింగ్ మోటారు సాయంతో బావుల్లో పూడిక తీత పనులకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం డ్రైడ్జింగ్ మోటార్లు బావుల్లో ఏర్పాటు చేసి ఈఈ నారాయణ, డీఈ సదయ్య, కాంట్రాక్టర్ సురేందర్‌రెడ్డి ట్రయల్ రన్ చేశారు. ప్రయోగం విజయవంతమైతే మోటార్లతోనే పూడికతీత పనులు పూర్తి చేస్తామన్నారు. వారి వెంట ఏఈలు ప్రశాంత్, రాజా ఉన్నారు.
డ్రెడ్జింగ్ మోటార్లతో ట్రయల్ రన్


