లారీని ఢీకొన్న బైక్‌.. | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న బైక్‌..

Oct 28 2025 8:48 AM | Updated on Oct 28 2025 8:48 AM

లారీని ఢీకొన్న బైక్‌..

లారీని ఢీకొన్న బైక్‌..

డిగ్రీ విద్యార్థి దుర్మరణం

మరో యువకుడి పరిస్థితి విషమం

నెల్లుట్ల బ్రిడ్జి వద్ద ఘటన

లింగాలఘణపురం: బైక్‌ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన సోమవారం జనగామ – సూర్యాపేట రోడ్డులోని నెల్లుట్ల బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన రాగి సంజయ్‌ (19), లింగాలఘణపురం మండలం నవాబుపేటకు చెందిన బూడిద ప్రసాద్‌ స్నేహితులు. ఇందులో సంజయ్‌ జనగామలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతుండగా, ప్రసాద్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు బైక్‌పై నవాబుపేట నుంచి జనగామ వైపునకు వస్తూ నెల్లుట్ల బిడ్రి వద్ద లారీని ఎదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో సంజయ్‌ అక్కడికక్కడే మృతి చెందగా ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ప్రసాద్‌ను 108లో జనగామ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement