
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
కేసముద్రం: యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. శుక్రవారం ఉదయం మండలంలోని కల్వల, ధన్నసరి పీఏసీఎస్ సెంటర్‌తోపాటు, ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదిక యూరియా పంపిణీ సెంటర్‌లను పరిశీలించారు. రైతులకు సరిపడా యూరియా అందుతుందని, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో ఎస్సై మురళీధర్‌రాజు, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
ప్రతీ రైతుకు యూరియా బస్తా అందుతుంది
మరిపెడ రూరల్: ప్రతీ రైతుకు యూరియా బస్తా అందేల చూస్తామని ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ అన్నారు. శుక్రవారం మరిపెడ పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులకు యూరియా పంపిణీని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. మరిపెడ సీఐ రాజ్‌కుమార్, సెకండ్ ఎస్సై కోటేశ్వరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.