
జీవన ఎరువులు వాడాలి
మహబూబాబాద్ రూరల్ : జీవన ఎరువుల వాడకంతో రైతులకు మేలు జరుగుతుందని మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.దిలీప్ కుమార్ అన్నారు. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా కంబాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మిర్చి పంట సాగులో పురుగులు, తెగుళ్ల యాజమాన్యంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిరపలో ఆశించే పురుగుల యాజమాన్యం, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా పంపిణీ చేసిన ట్రైకోడెర్మా, సూడోమొనాస్ జీవన ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యాన శాస్త్రవేత్త సుహాసిని మాట్లాడుతూ.. కూరగాయల సాగు పెంచుకోవాలని రైతులను కోరారు. పంట ఉత్పత్తి శాస్త్రవేత్త క్రాంతికుమార్ మిరపలో తెగుళ్ల యాజమాన్యం గురించి వివరించారు. ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని మాట్లాడారు.