
ట్రాన్స్‌ఫార్మర్ బిగించడం లేదని..
రాయపర్తి: విద్యుత్ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ బిగించడంలేదంటూ ఆరోపిస్తూ ఓ గిరిజన రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన గురువారం మండలంలోని మైలారం విద్యుత్‌సబ్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఊకల్ శివారు బీల్‌నాయక్‌తండాకు చెందిన రైతు రమేశ్ సుమారు 15 రోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం డీడీ చెల్లించాడు. అయితే సంబంధిత అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ బిగించకపోవడంతో వరి పంట ఎండుతోంది. దీనిపై మనస్తాపం చెందిన రమేశ్ ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరలైంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి గంటల వ్యవధిలోనే ట్రాన్స్‌ఫార్మన్ బిగించి సమస్యను పరిష్కరించారు. కాగా, ఈనెల 19న బీల్‌నాయక్ తండాకు చెందిన ఓ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందని అధికారులకు సమాచారం వచ్చిందని, టెక్నికల్ ఇబ్బందులు, సెలవు రావడంతో ఆలస్యమైందని వర్ధన్నపేట ఏడీఈ నటరాజ్ తెలిపారు.
● గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం
● మైలారం విద్యుత్‌సబ్ స్టేషన్‌లో ఘటన