
సెక్షన్‌కు ఏఈనే బాస్..
హన్మకొండ: కంపెనీకి సీఎండీ బాస్ మాదిరిగానే సెక్షన్‌కు అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) బాస్ అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వ రుణ్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి హనుమకొండ విద్యుత్ నగర్‌లోని తెలంగాణ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎండీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సెక్షన్ ఏఈ బాధ్య త అత్యంత కీలకమన్నారు. కంపెనీ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత అసిస్టెంట్ ఇంజనీర్లపై ఉందన్నారు. ప్రతీ ఉద్యోగి విద్యుత్ ప్రమాదాలు లేని కంపెనీ లక్ష్యంగా పని చేయాలన్నారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ రెడ్డి మాట్లాడుతూ డిప్లొమా ఇంజనీర్స్ హక్కులు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా (సర్కిల్) కమిటీలను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా శ్రీకర్, రాములు వ్యవహరించారు. హనుమకొండ సర్కిల్ ప్రెసిడెంట్‌గా రాజు, కార్యదర్శిగా వంశీ కృష్ణ, వరంగల్ సర్కిల్ ప్రెసిడెంట్‌గా చంద్రమౌళి, సెక్రటరీగా సాయి కృష్ణ, జనగామ సర్కిల్ అధ్యక్షుడిగా కనకయ్య, సెక్రటరీగా లక్ష్మీనారాయణ, మహబూబాబాద్ సర్కిల్ ప్రెసిడెంట్‌గా చలపతి రావు, సెక్రటరీగా సతీశ్, భూపాలపల్లి సర్కిల్ ప్రెసిడెంట్‌గా దేవేందర్, సెక్రటరీగా రాజ్ కుమార్, ములుగు సర్కిల్ ప్రెసిడెంట్‌గా రణధీర్, సెక్రటరీగా వేణు గోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్, తెలంగాణ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ సెక్రటరీ నార్ల సుబ్రహ్మణ్యేశ్వర్ రావు, అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి