
నేటినుంచి పలు రైళ్లు రద్దు
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని పెద్దపల్లి రైల్వే బైపాస్, బల్హార్షా–కాజీపేట సెక్షన్‌లో చేపడుతున్న రైల్వే నాన్ ఇంటర్‌లాకింగ్ బ్లాక్‌తో శుక్రవారం నుంచి కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం రాత్రి తెలిపారు.
రద్దయిన రైళ్లు..
ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు కాజీపేట–సిర్పూర్‌టౌన్ (17003) ప్యాసింజర్, బల్హార్షా–కాజీపేట (17004) సింగరేణి ప్యాసింజర్, బల్హార్షా–కాజీపేట (17036) ప్యాసింజర్, సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (12757) ఇంటర్‌సిటీ, సిర్పూర్‌కాగజ్‌నగర్–సికింద్రాబాద్ (12758) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు తెలిపారు.
పలు రైళ్లు కాజీపేట వరకే..
ఈ నెల 25 నుంచి 27వ తేదీవరకు హైదరాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (17011) ఎక్స్‌ప్రెస్, సిర్పూర్‌కాగజ్‌నగర్–బీదర్ (17012) ఎక్స్‌ప్రెస్, భద్రాచలంరోడ్–బల్హార్షా (17033) సింగరేణి, సిర్పూర్‌టౌన్–భద్రాచలంరోడ్ (17034), సిర్పూర్‌కాగజ్‌నర్ –సికింద్రాబాద్ (17234) ఎక్స్‌ప్రెస్‌లను కాజీపేట నుంచి, కాజీపేట వరకు నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఉత్సాహంగా బాక్సింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని డీఎస్‌ఏ బాక్సింగ్ హాల్‌లో గురువారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 20 మంది క్రీడాకారులు హాజరయ్యారు. బాలికల విభాగంలో జహీదా, వైష్ణవి, ఎం.డి. అమ్రీన్, కె. సాయిప్రణీత, బాలుర విభాగంలో ఎన్. హర్షవర్ధన్, జి. మణిప్రసాద్, బి. భార్గవ్, జి. సుమిత్, పి. రామ్‌చరణ్, ఎస్. ఆర్య , పి. హర్షిత్ రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు నిర్వహణ కార్యదర్శి పి. రాజేందర్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు నేటి (శుక్రవారం) నుంచి ఈ నెల 27వ తేదీ వరకు హైదరాబాద్ షేక్‌పేట్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
మేడిగడ్డకు
పెరిగిన వరద
కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోంది. మూడు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి గోదావరి, ప్రాణహిత నదులకు వరద తాకిడి పెరిగింది. దీంతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 7.400 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది. ఫలితంగా వరద నీరు దిగువన మేడిగడ్డకు చేరుతోంది. అక్కడ బ్యారేజీకి 2.90లక్షల క్యూసెక్కులు వరద తరలి రావడంతో మొత్తం 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో దిగువకు తరలిస్తున్నారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు.

నేటినుంచి పలు రైళ్లు రద్దు

నేటినుంచి పలు రైళ్లు రద్దు

నేటినుంచి పలు రైళ్లు రద్దు