
జల సవ్వడి..
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప అడవిలోని భీమునిపాద జలపాతం బుధవారం జాలువారుతూ చూపరులను కనువిందు చేసింది. కొన్ని రోజుల నుంచి మోస్తరు వర్షం కురుస్తుండగా, ఆదివారం నుంచి ఆ జలపాతం జాలువారడం ప్రారంభమైంది. రెండు రోజులుగా రాత్రి సమయాల్లో భారీ వర్షం కురువడంతో జలపాతం భారీగా జాలువారుతూ సమీపంలోని భీమునిపాదం చెరువులోకి ప్రవహించింది. దీంతో పర్యాటకులు వివిధ వాహనాల ద్వారా చేరుకుని జలపాతంలో స్నానంచేస్తూ సందడి చేశారు. కాగా, మొదటి సారి ఎత్తైన గుట్టల నడుమ నుంచి భీమునిపాదంగా పిలిచే ప్రదేశం నుంచి జలపాతం జాలువారడంతో పచ్చని అటవీ ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది.
జాలువారుతున్న జలపాతాలు
కనువిందు చేస్తున్న భీమునిపాదం,
పాండవులు, వంకమడుగు
వాటర్ ఫాల్స్
పర్యాటకుల సందడి..