సాగుపై ఆశలు | - | Sakshi
Sakshi News home page

సాగుపై ఆశలు

Jul 24 2025 7:10 AM | Updated on Jul 24 2025 7:10 AM

సాగుప

సాగుపై ఆశలు

సాక్షి, మహబూబాబాద్‌: అన్నదాతలతో ప్రకృతి దో బూచులాడుతోంది. జూన్‌, జూలైలో కురవాల్సిన వర్షాలు ఈ ఏడాది ఆలస్యం కావడంతో రైతులు సాగుపై సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే సాగుచేసిన పత్తి, మొక్కజొన్నకు నీరందక అయోమయంలో ఉన్న రైతలు వరి సాగుపై ఆలోచనలో పడ్డారు. ఈ సమయంలో రెండు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాలు అన్నదాతల్లో సాగుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి.

ఇప్పటి వరకు సందిగ్ధం

ఈ వానాకాలం సీజన్‌లో 4,29,790 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 2,19,143 ఎకరాల్లో వరి, 84,854 ఎకరాల్లో పత్తి, 58,361 ఎకరాల్లో మొక్కజొన్న, 52,249 ఎకరాల్లో మిర్చి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు పంట ప్రణాళికలో పేర్కొన్నారు. ఈక్రమంలో ముందుగా కురిసన వర్షాలతో 77,095 ఎకరాల్లో పత్తి, 53,306 ఎకరాల్లో మొక్కజొన్న, 10,331 ఎకరాల్లో జీలుగు, 1,695 ఎకరాల్లో పెసర, 439 ఎకరాలో జనుముతోపాటు ఇప్పటి వరకు 31,582 ఎకరాల్లో వరి నాట్లు, కొంతమేర పసుపు, కంది పంటలు సాగుచేశారు. దీంతో జూలై మొదటి వారంలో 82 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు అయినట్లు అధికారులు అంచనా వేయగా.. ప్రస్తుతం ఆ విస్తీర్ణం 1,75,021 ఎకరాలకు చేరింది.

వరి సాగుకు ముందడుగు

జిల్లా వ్యాప్తంగా 2,19,143 ఎకరాల్లో వరిసాగు అంచనా ఉండగా ఇప్పటి వరకు 31,582 ఎకరాల్లో సాగుచేశారు. మరో 1,23,674 ఎకరాల్లో నాట్లు వేసేందుకు సరిపడ వరినార్లు పోసుకొని రైతులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం 4,47,942 ఎకరాలు ఉండగా ఇందులో 1,594 గొలుసుకట్టు చెరువులు, కుంటల నీటితో 95,460 ఎకరాలు సాగు చేస్తారు. 1,48,222 ఎకరాలు చెక్‌డ్యామ్‌లు, అనకట్టలు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌, ఎస్సార్‌ఎస్పీ కాలువల నీటిని వినియోగించి సాగు చేసుకుంటారు. మరో 2,04,260 ఎకరాల్లో బోర్లు, బావులపై ఆధారపడి సాగుచేస్తారు. ఇప్పటికే కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల మండలాల్లోని పలు చెరువుల్లో నీరు రాగా మిగిలిన ప్రాంతాల్లో నీరు వస్తుందనే ఆశతో వరి సాగుపై రైతులు ఆసక్తిగా ఉన్నారు.

వర్షపాతం ఇలా..

రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 937 మిలీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కేసముద్రం 103 మిల్లీ మీటర్లు, కొత్తగూడ 94.4 మి.మీ., గంగారం 78.4 మి.మీ., గూడూరు 75 మి.మీ., గార్ల 68.8 మి.మీ., పెద్దవంగర 68.6 మి. మీ., మానుకోట 61.2 మి.మీ., నమోదు కాగా అత్యల్పంగా దంతాలపల్లి 32.8 మి.మీ., నర్సింహులపేట 34 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

మోస్తరు వర్షంతో తేరుకున్న రైతులు

బావులు, బోర్ల కింద సాగు ముమ్మరం

చెరువే ఆధారమైన భూముల్లో ఆచితూచి

సాగుపై ఆశలు1
1/1

సాగుపై ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement