
బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్
మహబూబాబాద్: అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా అనిల్‌కుమార్ బుధవారం బా ధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందచేఽశారు. అనిల్‌కుమార్ గతంలో హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా.. మహబూబ్‌నగర్ రెవెన్యూ డివి జనల్ అధికారిగా పని చేశారు. అనిల్‌కుమార్‌కు మానుకోట ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్ రాజేశ్వర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్‌కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఎకై ్సజ్ వాహనాల వేలం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల వేలంపాట జిల్లా ఎకై ్సజ్ అధి కారి కిరణ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఎకై ్సజ్ స్టేషన్ కార్యాలయంలో చేపట్టిన ఈవేలంలో 44 వాహనాలకు 43 వాహనాలను డీడీలు చెల్లించిన వ్యక్తులు కొనుగోలు చేశారు. రూ.4.88 లక్షలుగా నిర్ణయించి వేలం నిర్వహించగా రూ.10,22,500 ఆదాయం వచ్చిందని ఎకై ్సజ్ సీఐ చిరంజీవి వెల్లడించారు.
యువకుడిపై పోక్సో కేసు
తొర్రూరు: మండలానికి చెందిన ఓ యువతిని వేధింపులకు గురి చేస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. తొర్రూరు పట్టణానికి చెందిన కొమ్ము సృజన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని మైనర్‌గా ఉన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అప్పటినుంచి శారీరక సంబంధం ఏర్పర్చుకున్నాడు. కొంతకాలంగా పెళ్లి చేసుకోవాలని యువతి కోరుతుండగా యువకుడు తిరస్కరించాడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సదరు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని ఎస్సై తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంతో
రైతులకు మేలు
మహబూబాబాద్ రూరల్: రైతులకు ప్రకృతి వ్యవసాయంతో మేలు కలుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు, కృషి సఖిలకు సహజ వ్యవసాయంపై శిక్షణ, అవగాహన కార్యక్రమం మహబూబాబాద్‌లోని రైతువేదికలో బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సహజ వ్యవసాయ పద్ధతులు, కృషి సఖి విధి విధానాలు, బయో ఇన్‌పుట్ వ నరుల కేంద్రం ఏర్పాటు, నేల ప్రాముఖ్యత, అనేక అంశాలపై వివరించారు. మల్యాల జేవీఆర్ హెచ్‌ఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నాగరాజు, టెక్నికల్ ఏడీఏ మురళీ, టెక్నికల్ వ్యవసాయ అధికారి జావీద్ ఖాన్, ఏఓ తిరుపతిరెడ్డి, ట్రైనర్ జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రతీ రైతుకు బిల్లు ఇవ్వాలి
కొత్తగూడ: రైతులు కొనుగోలు చేసిన వ్యవసాయానికి సంబంధించిన ప్రతీ వస్తువుకు బిల్లు ఇవ్వాలని డీఏఓ శ్రీనివాసరావు వ్యాపారులకు సూచించారు. మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువుల షాపులను ఆయన బుధవా రం తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయించొద్దని అన్నారు. స్టాక్ రిజిష్టర్, బిల్లు బుక్కులు, గోదాంలు పరిశీలించారు. ఆయన వెంట ఏఓ జక్కుల ఉదయ్, ఏఈఓ రాజు ఉన్నారు.
విమానాశ్రయాలు
త్వరగా నిర్మించాలి
హన్మకొండ: వరంగల్, కొత్తగూడెంలో విమానాశ్రయాల నిర్మాణాలు త్వరగా మొదలు పెట్టాలని మాజీ ఎంపీ, ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును సీతారాంనాయక్ కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా సీతా రాంనాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాలు నిర్మించేందుకు చిత్తశుద్ధితో ఉందని అన్నారు. వరంగల్ విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మంత్రి చెప్పినట్లు వివరించారు. డీపీఆర్ మేరకు 800 ఎకరాలు కేటాయించాల్సి ఉండగా.. 600 ఎకరాలు మాత్రమే కేటాయించారని.. మిగతా 200 ఎకరాలు కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని చెప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావాల్సి న భూమి సమకూర్చాలని డిమాండ్ చేశారు.

బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్

బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్