
పట్టుదలతో చదివి ఉన్నత శ్రేణిలో రాణించాలి
గూడూరు: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శ్రేణిలో రాణించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి కేజీబీవీతోపాటు గూడూరులోని ప్రభుత్వ బాలుర హైస్కూల్, స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ని బుధవారం ఆయన ఆకస్మికతంగా తనిఖీ చేశారు. ముందుగా కేజీబీవీ, బాలుర హైస్కూల్‌లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. ప్రతీ సబ్జెక్టుపై పట్టు సాధించే విధంగా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రత, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం తప్పనిసరి అన్నారు. ప్రత్యేక అధికారులు కేటాయించిన వసతి గృహాలను తనిఖీ చేస్తూ నివేదికలు అందించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆస్పత్రి వైద్యులు, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన మందులు ఉన్నాయా అని అడిగారు. స్టాక్ రూంలో మందుల నిల్వ రిజిస్టర్ పరిశీలించారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్