యువత సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యువత సద్వినియోగం చేసుకోవాలి

Jul 23 2025 6:08 AM | Updated on Jul 23 2025 6:10 AM

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌

మహబూబాబాద్‌: డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజ్‌ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఐపాస్‌ ద్వారా 12 యూనిట్లకు రూ. 24.29కోట్ల పెట్టుబడితో అనుమతులు పొందినట్లు తెలిపారు. కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, మానుకోట, మరిపెడ, తొర్రూరు మండలాల్లో రైస్‌ మిల్లుల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీమన్నారాయణ, సంబంఽధిత అఽధికారులు పాల్గొన్నారు.

యూరియా కొరత ఉండదు

గూడూరు: పంటలకు యూరియా సరఫరా అవుతుందని, రైతులు అధైర్యపడొద్దని ఇన్‌చార్జ్‌ డీఏఓ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ యూరియా గోడౌన్‌ను మంగళవారం ఆయన ఏఓ అబ్దుల్‌ మాలిక్‌తో కలిసి తనిఖీ చేశారు. గోడౌన్‌ నిల్వ, విక్రయ రిజిస్టర్‌ పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. రైతులు మోతాదుకు మి ంచి యూరియా ఉపయోగించవద్దని, యూ రియా నిల్వ చేసుకోవద్దని సూచించారు. గూ డూరు సెంటర్‌కు 40టన్నులు, అప్పరాజ్‌పల్లి సెంటర్‌కు 20టన్నుల యూరియా వచ్చిందని, రైతులు అవసరం మేరకు తీసుకెళ్లాలన్నారు.

జలపాతం వద్ద

పోలీసు బందోబస్తు

గూడూరు: ఇటీవల కురుస్తున్న వర్షాలతో జా లువారుతున్న భీమునిపాద జలపాతం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు. ఈమేరకు మంగళవారం ఇద్దరు సిబ్బందిని నియమించారు. జలపాతం వద్దకు ఎలాంటి మత్తు పానీయాలు తీసుకురావొద్దని, నిబంధనలు పాటించాలని పర్యాటకులకు వారు సూచిస్తున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

మహబూబాబాద్‌ అర్బన్‌: తెలంగాణ ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి గానూ అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విదేశీ విద్యానిధి పథకానికి అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుందని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎం.నర్సింహస్వామి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థులకు రూ.20 లక్షలు స్కాలర్‌షిప్‌ అందిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5లక్షలకు మించకుండా ఉండాలని, టొఫెల్‌, పాస్‌పోర్టు, వీసా అర్హత కలిగి ఉండాలని, విదేశీ విద్యాలయాల్లో అడ్మిషన్‌ పొంది ఉండాలన్నారు. అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో సంబంధిత వెబ్‌సైట్‌లో ఈ నెల 23నుంచి ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్‌ రెండో అంతస్తులో ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

రాష్ట్రస్థాయి

పోటీల్లో సత్తా చాటాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాస్థాయి డ్రా యింగ్‌ పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో జిల్లా స్థా యి కామిక్‌ డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు డ్రాయింగ్‌ పోటీలు ఉపయోగపడుతా యన్నారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ముగ్గురు విద్యార్థులు ఎంపికవ్వడం హర్షించదగిన విషయమన్నారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ఆజా ద్‌, జిల్లా సైన్స్‌ అధికారి బి.అప్పారావు, పాఠశాల హెచ్‌ఎం సిరినాయక్‌, డ్రాయి ంగ్‌ ఉపాధ్యాయులు దాసరి అంబరీష, రాజేశ్‌, నారాయణ, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

యువత సద్వినియోగం  చేసుకోవాలి1
1/3

యువత సద్వినియోగం చేసుకోవాలి

యువత సద్వినియోగం  చేసుకోవాలి2
2/3

యువత సద్వినియోగం చేసుకోవాలి

యువత సద్వినియోగం  చేసుకోవాలి3
3/3

యువత సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement