
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్ 10ఏళ్ల పాలనలో రేషన్ కార్డులు పంపిణీ చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రజా ప్రభుత్వంలోనే పేదల రేషన్ కార్డుల కల సాకారమైందని, ఇప్పటి వరకు కార్డు రానివారు మీసేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనేక ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మిట్టకంటి రామిరెడ్డి, నాయకులు బెల్లంకొండ శ్రీనివాస్, నలమాస వెంకన్న, అజ్మీరా సురేశ్, ఇస్లావత్ బాలాజీ, బాతుక స్వర్ణలత, చెన్నూరి విజయలక్ష్మి, పద్మం ప్రవీణ్ కుమార్, తోట యాకంబ్రం, భూక్య రామచందర్, రాంపిళ్ల నరేశ్, గడిసందు అశోక్, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే
భూక్య మురళీనాయక్