హసన్‌పర్తి: భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)–గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మ హిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్న ట్లు సంస్థ డైరెక్టర్ రవి తెలిపారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలు అర్హులన్నారు. ములుగు, వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబా బా ద్ జిల్లాలకు చెందిన మహిళలు శిక్షణకు దరఖా స్తు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచి త భోజనం, వసతి కల్పించనున్నట్లు చెప్పారు. 18–45 ఏళ్ల వయసు కలిగి తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు నాలుగు పాస్‌పోర్టు సైజ్‌ఫొటో, రేషన్, ఆధార్, విద్యార్హత ధ్రువీకరణ జిరాక్స్ పత్రాలతో ఈనెల 25వ తేదీలోపు హసన్‌పర్తిలోని సంస్కృతి విహార్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9849307873, 9949108934 నంబర్లను సంప్రదించాలన్నారు.
కాజీపేట మీదుగా ప్రయాణించే పది ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు
కాజీపేట రూరల్ : సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో చక్రదపూర్ రైల్వే డివిజన్‌లోని జార్సుగూడ యార్డులో జరిగే రైల్వే నాన్ ఇంటర్‌లాకింగ్ వర్క్స్‌తో కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా ప్రయాణించే పది ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రద్దు చేసినట్లు రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు.
ఆయా తేదీల్లో రద్దయిన రైళ్ల వివరాలు..
ఆగస్టు 26, సెప్టెంబర్ 9వ తేదీన చర్లపల్లి–దర్బాంగా (17007) ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 29, సెప్టెంబర్ 12వ తేదీల్లో దర్బాంగా–చర్లపల్లి (17008) ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 28వ తేదీన హైదరాబాద్–రక్సోల్ (17005) ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 31వ తేదీన రక్సోల్–హైదరాబాద్ (17006) ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 30వ తేదీన చర్లపల్లి–రక్సోల్ (07051) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 2వ తేదీన రక్సోల్–చర్లపల్లి (07052) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 1వ తేదీన చర్లపల్లి–రక్సోల్ (07005) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 4వ తేదీన రక్సోల్–చర్లపల్లి(07006) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 8వ తేదీన హెచ్.ఎస్. నాందేడ్–సంత్రగచ్చి (12767) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 10వ తేదీన సంత్రగచ్చి–హెచ్.ఎస్.నాందేడ్ (12768) ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు.
జ్వరంతో విద్యార్థి మృతి
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి దొడ్డిపట్ల జశ్వంత్(18) జ్వరం, పచ్చకామెర్లతో బాధపడు తూ మంగళవారం మృతి చెందాడు. 15 రోజులుగా వరంగల్‌లో చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. మళ్లీ జ్వరం రావడంతో వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుడు ఇంటర్ పూర్తి చేశాడు. డిగ్రీలో చేరాల్సి ఉంది. కాగా, జశ్వంత్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.