
పరికరాలు సరే.. మాస్టర్ ఎక్కడ.?
జూన్ మొదటి వరంలో జిల్లాలోని పది ప్రభుత్వ పాఠశాలకు సంగీత పరికరాలు సరఫరా చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు మాస్టర్‌ను నియమించలేదు. అయితే సంగీతంలో ఏ పరికరం వాయించాలన్నా అందులో నేర్పరి కావాలి. ఇలా డోలక్, తబలా మినహా.. వయోలిన్, హార్మోనియం వాయించేందుకు వేర్వేరు మాస్టర్లు అవసరం. అయితే వారి నియామకంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. దీంతో సంగీత పరికరాలను చూసిన విద్యార్థులు మాస్టర్ ఎప్పుడు వస్తాడో.. సంగీతం ఎప్పుడు నేర్పిస్తాడో అని ఆతృతతో ఉన్నారు. అయితే పరికరాలను భద్రపర్చడం ఇబ్బందిగా ఉందని, ఎలుకలు కొట్టి పాడు చేస్తే ఎలా అని పలువురు హెచ్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు. త్వరగా మాస్టర్లను నియమిస్తే సంగీతం నేర్పడంతో పాటు పరికరాల భద్రత కూడా వారే చూసుకుంటారని అంటున్నారు.