
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
మహబూబాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌లో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు చేసినట్లు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక నంబర్ 79950 74803 ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలు వర్షాల సమయంలో సమస్యలు వస్తే పైనంబర్‌లో సంప్రందించాలన్నారు. 24గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
నేడు కామిక్
డ్రాయింగ్ పోటీలు
● డీఈఓ రవీందర్‌రెడ్డి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ప్రభుత్వ, కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో మంగళవారం ఉదయం 9:30నుంచి మ ధ్యాహ్నం 12గంటల వరకు జిల్లాస్థాయి కామి క్ డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ రవీందర్‌రెడ్డి సోమవారం తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషలతో కామిక్ స్ట్రీప్ చిత్రరూపంలో స్వయంగా గీయాలని, ప్రతీ పాఠశాల నుంచి ఒక విద్యార్థికి మాత్రమే పోటీలో పాల్గొ నే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు జి ల్లా సైన్స్ అధికారి బి.అప్పారావు 98495 98281 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు.
ప్రమాదాల
నివారణకు చర్యలు
డోర్నకల్: విద్యుత్ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టామని విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ యార్డులో జరుగుతున్న మరమ్మతు పనులను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యుత్ సిబ్బంది స్థానికంగా ఉంటూ వర్షాల సమయంలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీఈ రమేశ్, ఏఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
గురుకులం నుంచి
తప్పించుకుపోయిన బాలిక
● గంట వ్యవధిలో
ఆచూకీ కనుగొన్న పోలీసులు
నెక్కొండ: బాలిక తప్పించుకుపోయిన సంఘటన చింతనెక్కొండ క్రాస్‌రోడ్డులోని టీజీ గురుకుల పాఠశాలలో సోమవారం రాత్రి జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అప్పయ్య కుమార్తె అక్షిత ఇటీవల ఐదో తరగతిలో గురుకులంలో చేరింది. తల్లిదండ్రులపై బెంగ, ఇక్కడ చదవడం ఇష్టం లేకపోవడంతో బాలిక మూడీగా ఉండేది. ఈ క్రమంలో పాఠశాల నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని బయటకు వెళ్లింది. కాగా, సాయంత్రం 4.30 గంటలకు రోల్‌కాల్ (సాయంత్రం అసెంబ్లీ)లో బాలిక లేదన్ని విషయాన్ని గురుకుల ఉపాధ్యాయులు గమనించారు. దీంతో పాఠశాల ఆవరణలో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళనకు గురైన ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు టీంలుగా ఏర్పడి గాలించారు. ఓ ద్విచక్రవాహనంపై బాలిక అలంకానిపేట వరకు వెళ్తోంది. ఇది గమనించిన పోలీసులు బాలికను పాఠశాలకు తీసుకొచ్చి ఉపాధ్యాయుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. గంట వ్యవధిలో బాలిక ఆచూకీ తెలుసుకున్న పోలీసులను పలువురు అభినందించారు.
ఏఐతో విద్యాబోధన
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ అధ్యాపకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సూచించారు. టెక్నాలజీ ఎనెబుల్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనే అంశంపై నిట్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు కొనసాగనున్న వర్క్‌షాప్‌ను సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తరగతి గదుల్లో పుస్తకాల్లోని పాఠ్యాంశాలనే కాకుండా నిజజీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో వివరించాలన్నారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కృషి చేయాలని ఆయన అన్నారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు