
జూలో శరణ్ షో షురూ..
న్యూశాయంపేట : వరంగల్ హంటర్ రోడ్‌లోని కా కతీయ జువాలాజికల్ పార్క్‌లో వైట్ టైగర్(శరణ్, మగ, 13 ఏళ్ల వయసు) సందర్శకులను కనువిందు చేసింది. హైదరాబాద్ నెహ్రూ జువాలాజికల్ పా ర్క్ నుంచి తీసుకొచ్చిన తెల్లపులిని శుక్రవారం రాష్ట్ర అ టవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పాఠశాల చి న్నారులతో కలిసి ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. అ నంతరం జూపార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొ టో ప్రదర్శనను తిలకించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్క నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జువాలాజికల్ పార్క్‌కు దీటుగా వ రంగల్‌లోని కాకతీయ జూపార్క్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. రూ. కోటి వ్యయంతో పా ర్క్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. హరిత నిధి నుంచి రూ. 4.25 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ నిధులతో జూపార్క్‌లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు జంతువులు జూపార్క్‌కు వచ్చాయని, త్వరలో ఫిమేల్ వైట్‌టైగర్‌ను తీ సుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలి పారు. రానున్న రోజుల్లో సింహం, మరికొన్ని ఇతర జంతువులను తీసుకురానున్నట్లు వివరించారు. జూపార్క్‌లోని జంతువుల సంరక్షణకు జంతు ప్రే మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
క్యూఆర్ కోడ్.. చాట్‌బాట్
జూపార్క్‌లోని జంతువుల వివరాలు తెలుసుకునేందుకు క్యూఆర్‌కోడ్, చాట్‌బాట్ సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చారు. కాకతీయ జూపార్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు తెలుసుకోవచ్చు. కార్యక్రమంలో భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ భీమానాయక్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అటవీశాఖాధికారి అనుజ్‌అగర్వాల్, ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ కృష్ణమాచారి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు మయూరి, భిక్షపతి, ఎఫ్‌బీఓ శారద, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సురేఖ చేతుల మీదుగా
ఎన్‌క్లోజర్‌లోకి తెల్లపులి విడుదల
జూపార్క్‌లో విద్యార్థుల సందడి ..

జూలో శరణ్ షో షురూ..