
రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే దంపతులకు గాయాలు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, నర్మద దంపతులు శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో పుల్లయ్య స్వల్పంగా, నర్మద తీవ్రంగా గాయపడ్డారు. పుల్లయ్య దంపతులు కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా మార్గమధ్యలోని నల్లగొండ జిల్లా నకిరేకల్ వద్ద జాతీయ రహదారిపై మరో కారు ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టింది. దీంతో మాజీ ఎమ్మెల్యేకు చెందిన కియా కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. అదే సమయంలో మరో కారులో అటువైపు వెళ్తున్న మహబూబాబాద్‌కు చెందిన జాకీర్ ప్రమాద ఘటనను గమనించారు. వెంటనే తన వాహనాన్ని నిలిపి గాయపడిన మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, ఆయన భార్య నర్మదను చికిత్స నిమిత్తం నకరేకల్ శివారులోని కామినేని ఆస్పత్రికి తరలించారు.
నకిరేకల్ వద్ద ఘటన

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే దంపతులకు గాయాలు