
తండ్రి మందలించాడనే క్షణికావేశంలో..
● ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు
● చికిత్స పొందుతూ మృతి
దామెర: తండ్రి మందలించాడనే కారణంతో క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్ప డిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మోతె కుమార్ పెద్ద కుమారుడు బాలకృష్ణ (20) ఐటీఐ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాగా, బాలకృష్ణ దుర అలవాట్లు నేర్చుకుంటున్నాడని తండ్రి ఇటీవల మందలించాడు. మనుసులో పెట్టుకున్న బాలకృష్ణ.. క్షణికావేశంలో ఈ నెల 11న పురుగుల మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన బంధువులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఈ ఘటనపై తండ్రి కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ పేర్కొన్నారు.