
పాయిజన్ కేసులకు అధునాతన వైద్యసేవలు
నెహ్రూసెంటర్: జిల్లాలో గిరిజనులు అత్యధింగా పాయిజన్ తీసుకొని ప్రాణాలను కోల్పోతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని అధునాతన వైద్య సేవలు అందించి రక్షించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డయాలసిస్, ఐసీయూ సెంటర్లను పరిశీలించి స్వయంగా రోగులను పరీక్షించారు. అనంనతరం వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాయిజన్ తీసుకున్న వ్యక్తులను రక్షించేందుకు ప్రత్యేక డయాలసిస్ బెడ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ తర్వాత మానుకోట జిల్లాలోనే పాయిజన్ తీసుకున్న వారిని బతికించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆస్పత్రిలో సిజేరియన్ కాన్పులను తగ్గించి నార్మల్ డెలివరీలను పెంచాలని, గైనిక్ విభాగంలో కొంత మంది గైర్హజరవుతున్నారని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, జీఎంసీ ప్రిన్సిపాల్ వెంకట్ లకావత్, ఆర్‌ఎంఓ జగదీశ్వర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మురళీనాయక్