
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
మహబూబాబాద్ రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి పీహెచ్‌సీ, జెడ్పీ హై స్కూల్, జీపీ కార్యాలయాలను గురువారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య సి బ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల న్నారు. హైస్కూల్‌లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ తరగతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ బడుల్లో అత్యుత్తమ విద్యాబోధన అందుతుందన్నారు. తరగతి గదుల్లో పిల్లల విద్యాసామర్థ్యాలను అదనపు కలెక్టర్ స్వ యంగా పరిశీలించి, మెనూ ప్రకారం రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణంలో పక్కాగా శానిటేషన్ నిర్వహించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. గ్రామంలోని పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, హెచ్‌ఎం ఉప్పలయ్య, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో