
నకిలీ సర్టిఫికెట్ల తయారీలో మరో 9మంది అరెస్ట్
రామన్నపేట : నకిలీ సర్టిఫికెట్ల తయారీలో ప్రధాన సూత్రదారుడు అమరేందర్‌ను ఈ నెల 12వ తేదీన అదుపులోకి తీసుకోగా అతడికి సహకరించిన మరో 9 మందిని గురువారం అరెస్ట్ చేసినట్లు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపి తెలిపారు. అమరేందర్ హైదరాబాద్, వరంగల్ రెవెన్యూ అఽధికారుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ రెసిడెన్షియల్, మున్సిపాలిటీ బర్త్ సర్టిఫికెట్లను తయారు చేస్తూ ఏజెంట్ల ద్వారా ఆధార్ కార్డులో మార్పులు చేస్తూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేవాడన్నారు. కాగా, ఈ ఘటనలో అమరేందర్‌కు సహకరించిన నర్సంపేటకు చెందిన జులూరి ప్రభాకర్, వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతానికి చెందిన కొన్ని సురేశ్, మూడు వేముల రాజేందర్, హనుమకొండ పద్మాక్షి కాలనీ చెందిన గొల్లపల్లి శశికాంత్, భూపాలపల్లికి చెందిన సంకరమైన సాగర్, హనుమకొండ నక్కలగుట్టకు చెందిన నీరటి రాజేశ్, నాగపురి లిఖిత్‌కుమార్, ఎం.డి జుబేర్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ తుమ్మ గోపి తెలిపారు.
వివరాలు వెల్లడించిన
మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపి