
పిడుగుపాటుతో యువకుడి మృతి
మల్హర్: పిడుగుపాటుతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యలు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారం గ్రామానికి చెందిన కల్వల నాగరాజు (20) తమ వ్యవసాయ మోటారు మల్లారం మానేరు వాగులో మునిగిపోతుండడంతో తీసేందుకు గురువారం సాయంత్రం తండ్రితో కలిసి వెళ్లాడు. వాగులోనుంచి మోటారును బయటకు తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు.