విద్యార్థులకు సక్రమంగా బోధించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సక్రమంగా బోధించాలి

Jul 18 2025 1:21 PM | Updated on Jul 18 2025 1:21 PM

విద్యార్థులకు సక్రమంగా బోధించాలి

విద్యార్థులకు సక్రమంగా బోధించాలి

కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం

కేయూ క్యాంపస్‌: విద్యార్థులకు సక్రమంగా బోధించాలని కేయూ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీలోని విద్యాకళాశాలలో ప్రిన్సిపాల్‌ టి.మనోహర్‌తో కలిసి అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో రామచంద్రం మాట్లాడారు. ఈనెల 16న విద్యాకళాశాలలో విద్యార్థులు ఆందోళన చేసి పలు సమస్యలను రిజిస్ట్రార్‌ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో చర్చించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ రామచంద్రం మాట్లాడుతూ పాఠాలు సరిగా అర్థం కావం లేదని విద్యార్థులు చెబుతున్నారని, అధ్యాపకులు ముందు ప్రిపేర్‌ అయిన సరిగా బోధించాలని సూచించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా జవాబుపత్రాల వాల్యుయేషన్‌ చేయాలని చెప్పినట్లు సమాచారం. విద్యార్థినుల పట్ల అనుచితంగా మాట్లాడొద్దని ఆదేశించారని తెలిసింది. కాగా, కొందరు విద్యార్థులు క్లాస్‌లకు సరిగా రావడం లేదనే విషయాలను పలువురు అధ్యాపకులు.. రిజిస్ట్రార్‌ దృష్టి తీసుకెళ్లారు. తాము సరిగానే మూల్యాంకనం చేస్తున్నామని సమాధానం ఇచ్చారని తెలిసింది. అనంతరం విద్యా కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య టి. మనోహర్‌ మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించాక 75 నుంచి 80 శాతం అటెండెన్స్‌ ఉండాలని విద్యార్థులకు చెప్పానన్నారు. క్లాస్‌లకు వచ్చేవారికే అటెండెన్స్‌ వేయిస్తున్నామన్నారు. సరిపడా అటెండెన్స్‌ లేనిపక్షంలో పరీక్షలకు కూడా అనుమతించబోమని స్పష్టం చేశారని సమాచారం.

పోక్సో కేసులో తండ్రికి రిమాండ్‌

దేవరుప్పుల : మండలంలోని ఓ గ్రామంలో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తండ్రిని పోక్సో కేసులో గురువారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సృజన్‌కుమార్‌ తెలిపారు. రెండు రోజుల నుంచి కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తండ్రిపై కుటుంబీకుల ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పోక్సో కేసు నమోదు చేసి జనగామ కోర్టులో హాజరుపర్చామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

ప్రహరీకి అమర్చిన కరెంట్‌ బైండింగ్‌ వైర్‌కు తాకి..

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ములుగు రూరల్‌: ప్రహరీకి అమర్చిన కరెంట్‌ బైండింగ్‌ వైర్‌కు తాకి ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం ఇంచర్లలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతల రవి(45) తాపీ మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం జంగాలపల్లి క్రాస్‌ వద్ద బుర్ర సమ్మయ్య అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పనికి వెళ్లాడు. సమ్మయ్య ఇంటి పక్కన ఉన్న గౌస్‌పాషా అనే వ్యక్తి కోతల బెడద కారణంగా ప్రహరీకి బైడింగ్‌ వైరు అమర్చి విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చాడు. రవి ఉదయం స మ్మయ్య ఇంటికి పనికి వచ్చి ఏమరపాటున ప్ర హరీకి తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎండీ గౌస్‌, అతడి భార్య నస్రీన్‌, బుర్ర సమ్మయ్య, అతడి భార్య వనమాల, కొడుకులు నరేశ్‌, సురేశ్‌, రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లు, ప్రహరీలకు ఎలక్ట్రిక్‌ ఫెన్సింగ్‌ అమర్చి అమాయకుల మృతికి కారణం కావొద్దన్నారు. ఎలక్ట్రిక్‌ ఫె న్సింగ్‌ అమర్చిన వారిని, అది తెలిసి సమాచా రం ఇవ్వని వారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement