
జాన్‌పాక వద్ద ఆర్‌ఓబీ నిర్మించండి
కాజీపేట రూరల్/న్యూశాయంపేట : జాన్‌పాక వద్ద ఐఆర్‌ఆర్ ఏర్పాటు చేస్తున్నందున ఆర్‌యూబీకి బదులు ఆర్‌ఓబీ నిర్మించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద.. గురువారం కాజీపేట మండలం అయోధ్యపురంలోని రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలనకు వచ్చిన రైల్వే జీఎం సంజ్‌య్‌కుమార్ శ్రీవాస్తవ కలిసి కోరారు. జాన్‌పాక ఎల్‌సీ 63ఏను మూసివేస్తూ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో దాని పక్కనుంచి కుడా ఆధ్వర్యంలో ఇన్నర్‌రింగ్‌రోడ్ ని ర్మాణం జరుగుతున్నందున రైల్వే ఓవర్‌బ్రిడ్జి పరిశీలి ంచాలని కలెక్టర్‌తోపాటు కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్,‘కుడా’చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి కోరా రు. దీనిపై పరిశీలిస్తామని జీఎం హామీ ఇచ్చారు.
కాజీపేట రైల్వే బస్టాండ్ కోసం స్థలం ఇవ్వండి
కాజీపేట రైల్వే బస్టాండ్ కోసం స్థలం ఇవ్వాలని, చిరు వ్యాపారులకు కాంప్లెక్స్ నిర్మించాలని, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో స్థానికులకు ఉద్యోగవకాశం కల్పించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి..రైల్వే జీఎంకు వినతిపత్రం ఇచ్చారు.
పరిహారం ఇప్పించండి..
రైల్వే యూనిట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో రైల్వే జీఎంను అయోధ్యపురం రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ భూనిర్వాసిత రైతులు కలిసి తమకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, రైల్వేనుంచి రావాల్సిన పరిహారం ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. జీఎంను కలిసిన వారిలో ఉల్లెంగుల శ్రీనివాస్, మామిండ్ల మల్లయ్య, మామిండ్ల బిక్షపతి, ఎలసగరం సమ్మయ్య, గడ్డం అనిల్, కాయిత రమ, జేరుపోతుల కుమారస్వామి ఉన్నారు.

జాన్‌పాక వద్ద ఆర్‌ఓబీ నిర్మించండి