
వేగంగా విద్యుత్ సమస్యల పరిష్కారం
హన్మకొండ/హసన్‌పర్తి: నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని వేగంగా విద్యుత్ సమస్యలు పరిష్కరించడానికి ‘రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం’ను ప్రవేశపెట్టినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ నగర శివారులోని దేవన్నపేట 33/11 కేవీ సబ్ స్టేషన్ తనిఖీ చేశారు. రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పనుల పురోగతిని పరిశీలించారు. ఎదురవుతున్న సమస్యలు, పరిష్కరిస్తున్న తీరును అధికారులను అడిగి తె లుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్య మైన విద్యుత్ సరఫరా అందించడానికి రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం ఎంతో దోహద పడుతుందన్నారు. రియల్ టైంలో విద్యుత్ అంతరాయ సమాచారాన్ని ఫీల్డ్ సిబ్బందికి తెలిపి అతి తక్కువ సమయంలో కరెంట్ సరఫరాను పునరుద్ధరించొచ్చన్నారు. విద్యుత్ వినియోగం, ఓల్టేజీ లెవెల్స్, తది తర వివరాలు రియల్ టైంలో సేకరిస్తారన్నారు. అ నంతరం మడికొండ సెక్షన్‌లో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్సు చీఫ్ ఇంజనీర్ తి రుమల్ రావు, హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, ఐటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఎమ్మార్టీ డీఈ దర్శన్ కుమార్, కె.అనిల్ కుమార్, ఏడీఈ పి.అశోక్, ఏఈ సత్యనారాయణ పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి
దేవన్నపేట సబ్ స్టేషన్ తనిఖీ