
జల్సాల కోసం అడ్డదారులు..
బయ్యారం: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు యువకులు అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కారు. గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కారు. ఈ మేర కు గురువారం బయ్యారం పీఎ స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గార్ల–బయ్యారం సీఐ రవికుమార్ వివరాలు వెల్లడించా రు. మంచిర్యాల జిల్లా రాజీవ్‌నగర్‌కు చెందిన పర్లపల్లి రాజు, వేల్పుల శాంతికుమార్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన రాజు స్నేహితులు. జల్సాలకు అలవాటు పడిన వీరికి మేసీ్త్ర పని ద్వారా వచ్చే డబ్బు సరిపోకపోవడంతో అక్రమంగా సంపాదించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా గంజాయి విక్రయాలు చేపట్టాలని నిర్ణయించుకున్నా రు. ఈ క్రమంలో పర్లపల్లి రాజు, వేల్పుల శాంతికుమార్.. గంజాయి కొ నుగోలు చేయడానికి రెండు రోజుల క్రితం విశాఖపట్నం వెళ్లారు. హు జూరాబాద్‌కు చెందిన రాజు తనకు పని ఉందని ఇంటి వద్దే ఉన్నాడు. విశాఖపట్నంలోని గోరాపూర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి వద్ద రూ. 2,69,250 లక్షల విలువైన 5.385 కేజీల గంజాయి కొనుగోలు చేసి రైలులో మంచిర్యాల వెళ్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు చేస్తారని భయపడి గార్ల రైల్వే స్టేషన్‌లో రైలు దిగి ఆటోలో మహబూబా బాద్ వైపునకు వెళ్తున్నారు. అదే సమయంలో గంధంపల్లి వద్ద ఎస్సై తిరుపతి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బ్యాగుతో పరారయ్యేందుకు ప్రయత్నించారు. వీరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని బ్యాగు తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. దీంతో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి సరుకు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. స మావేశంలో ఎస్సై తిరుపతి, అదనపు ఎస్సై మహబూబీ పాల్గొన్నారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్
రూ. 2.69 లక్షల విలువైన సరుకు స్వాధీనం