
వర్షాల కోసం వరదపాశం
స్టేషన్‌ఘన్‌పూర్: వర్షాలు కురవాలని కోరుతూ మండలంలోని రాఘవాపూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రా మాల రైతులు గురువారం రాఘవాపూర్ శివారులో ని పోతరాజు గండి వద్ద వరద పాశం పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రతీ ఏడాది గండిపోతరాజు బండి వద్ద వర్షాల కోసం పూజలు చేస్తామన్నారు. స్వా మివారికి నైవేద్యం సమర్పించిన అనంతరం వరద పాశం ఉంచి పూజలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం ఏళ్లు ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇలా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని నమ్మకమన్నారు. రైతులు హన్మంత్, కుమార్, రాజేందర్, శ్రీహరి, రాజు, వెంకటయ్య, నర్సింహులు, రాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు రైతులు సామూహికంగా వనభోజనాలకు వెళ్లారు.
రాఘవాపూర్‌లో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ