
విద్యుత్ తీగ తగిలి యువకుడి మృతి
ఎల్కతుర్తి: అడవి పందులను వేటడానికి విద్యుత్ వైర్ అమర్చగా, ఆ తీగ తాకి ఓ యువకుడి మృతి చెందిన ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌కు చెందిన గండికోట సాంబరాజు(32) తన స్నేహితులు శీలం బాలరాజు, ఊదరి రాజుతో కలిసి ఈనెల 12న పావురాల వేటకు గ్రామశివారులోని పచ్చునూరి ప్రవీణ్ పొలం వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అప్పటికే అక్కడ అడవి పందుల వేట కోసం గోపాల్‌పూర్‌కు చెందిన తక్కళ్లపల్లి చందర్‌రావు అనే వ్యక్తి సూచనతో అదే గ్రామానికి చెందిన పెండ్యాల తిరుపతి, ఎల్కతుర్తికి చెందిన బొజ్జ స్వామి, బొజ్జ సతీశ్.. పచ్చునూరి ప్రవీణ్ పొలం నుంచి తక్కళ్లపల్లి నర్సింగారావు పొలం వరకు విద్యుత్ వైరు అమర్చారు. దీనిని గమనించని సాంబరాజు విద్యుత్ తీగకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సాంబరాజు వెంట ఉన్న బాలరాజు, ఊదరి రాజు భయంతో పారిపోయారు. తెల్లవారుజామున విద్యుత్ వైరు అమర్చిన పెండ్యాల తిరుపతి, బొజ్జ స్వామి, బొజ్జ సతీశ్ వచ్చి చూడగా సాంబరాజు చనిపోయి కనిపించాడు. దీంతో నేరం తమపైకి రాకుండా మృతదేహాన్ని గోపాల్‌పూర్‌కు చెందిన మాసిపెద్ది భాస్కర్‌రావు వ్యవసాయ బావిలో పడేశారు. పావురాల వేట కోసం వెళ్లి బావిలో పడి మృతి చెందినట్లు చిత్రీకరించి కేసు తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి విశ్వసనీయ సమాచారం గోపాల్‌పూర్ క్రాస్ వద్ద ఆరుగురు నిందితులు పెండ్యాల తిరుపతి, తక్కళ్లపల్లి చందర్‌రావు, బొజ్జ స్వామి, బొజ్జ సతీశ్, శీల బాలరాజు, ఊదరి రాజును అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సీఐ పులి రమేశ్, ఎస్సై ప్రవీణ్‌కుమార్, సిబ్బంది మల్లేశం, విట్టల్‌రావు, బుచ్చిలింగం, భాస్కరెడ్డి, బక్క య్య, రాజయ్య, సుమన్ రంజిత్, సదానందంను అభినందించారు.
ఈ ఘటనలో ఆరుగురు
నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన
ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి