
సైన్స్ కాంగ్రెస్‌కు రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచాలి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఆగస్టు 19, 20, 21 తేదీల్లో మూడు రోజులు నిర్వహించబోయే తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌కు వివిధ యూనివర్సిటీల నుంచి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచేలా కృషిచేయాలని కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి కోరారు. బుధవారం క్యాంపస్‌లోని కమిటీ హాల్‌లో సైన్స్ విభాగాల అధిపతులు, ప్రొఫెషనల్స్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 98 అబ్‌స్ట్రాక్ట్‌లతోకూడిన రిజిస్ట్రేషన్లు అయ్యాయన్నారు. ఈనెలాఖరు వరకు సమయం ఉందని, అప్పటిలోగా ఎక్కువ మంది సైన్స్‌కాంగ్రెస్‌లో భాగస్వాములయ్యేలా నమోదు సంఖ్య పెంచాలని సూచించారు. ఈనెల15న నిర్వహించిన మానిటరింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను కూడా వివరించారు. ప్రధానంగా వనరుల సమీకరణ, వసతుల ఏర్పాట్లుకు సంబంధించిన వివరాలను సైన్స్‌కాంగ్రెస్ లోకల్ సెక్రటరీ బి. వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు.
కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి