
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై సమీక్ష
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఆగస్టు 19, 20, 21 తేదీల్లో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం కేయూలో వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం.. మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌లో భాగస్వాములు కాబోతున్న రీసెర్చ్ పేపర్ల సమర్పణకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కమిటీల బాధ్యతలు, అతిథులకు వసతి ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ లోకల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి. వెంకట్రామ్‌రెడ్డి, మానిటరింగ్ కమిటీ సభ్యులు, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జాయింట్ సెక్రటరీ వడ్డె రవీందర్, వైస్ ప్రెసిడెంట్ సి.హెచ్. సంజీవరెడ్డి, ప్రొఫెసర్లు టి. మనోహర్, బి. సురేశ్‌లాల్, ఆర్. మ ల్లికార్జున్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, ఎస్. జ్యోతి, జె. కృష్ణవేణి, ఎన్. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.