
విద్యుత్ షార్ట్ సర్క్యూట్..
● రూ.1.60 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం
● ఘన్‌పూర్‌లో ఘటన
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో మహాలక్ష్మి బేకరి వద్ద ఇళ్ల పైనుంచి వెళ్తున్న 33 కేవీ లైన్ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లలో రూ.1.60లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మెడ్‌ప్లస్ సమీపాన పలు ఇళ్ల మీదుగా 33 కేవీ విద్యుత్ లైన్ వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆ లైన్‌పై కాకు(పక్షులు)లు వాలడంతో ప్రమాదవశాత్తు మూడు ఇళ్లలో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో పి.సుగుణ ఇంటిలో రూ.70వేల విలువైన స్మార్ట్ టీవీ, రూ.30వేల విలువైన సీసీ కెమెరాలు, రూ.30వేల విలువైన ఫ్రిడ్జ్‌తో పాటు వైరింగ్, లైట్లు, స్విచ్‌లు దగ్ధమయ్యాయి. అదేవిధంగా బాలాజీ క్లాత్ స్టోర్స్ నిర్వాహకుల ఇంటిలో సర్వీస్ వైరు కాలిపోగా, సారంగానికి చెందిన రవళి కంగన్‌హాల్‌లో రూ.20వేల విలువైన టీవీ దగ్ధమైంది. కాగా, మే 20న 33 కేవీ వైరుపై పిడుగుపాటుతో అదే ఏరియాకు చెందిన కుసుమ రమేశ్ ఇంటిలో రూ.2లక్షల విలువైన ఎలక్ట్రానిక్ దగ్ధమయ్యాయి. కాలనీలో పలు ఇళ్లపై నుంచి 33 కేవీ విద్యుత్ లైన్ ప్రమాదకరంగా ఉందని, పలుమార్లు విద్యుత్ ప్రమాదాలు జరిగాయని కాలనీవాసులు గతంలో విద్యుత్‌శాఖ డీఈకి విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు పేర్కొన్నారు. ఇప్పటికై నా స్పందించి ఇళ్ల మీదుగా వెళ్తున్న 33కేవీ విద్యుత్ లైన్‌ను మార్చి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.