
స్విమ్మింగ్‌పూల్‌కు సెలవు
● రూ.40 లక్షలతో మరమ్మతులు ● నెల రోజులు నోఎంట్రీ
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ బాలసముద్రంలో కొనసాగుతున్న స్విమ్మింగ్ పూల్‌కు నెలరోజులు సెలవులొచ్చాయి. రెండు నెలల క్రితం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే వేసవిలో స్విమ్మింగ్‌పూల్‌కు రద్దీ ఉన్న నేపథ్యంలో పనులు చేపట్టకుండా నిలిపివేశారు. ఈ క్రమంలో వర్షాకాలం ప్రారంభం, విద్యా సంస్థలు తెరుచుకోవడంతో స్విమ్మింగ్ పూల్‌కు వచ్చే వారి సంఖ్య తగ్గింది. దీంతో వారం క్రితం స్విమ్మింగ్ పూల్ అభివృద్ది పనులు ప్రారంభించారు. రోజుకు ఆరు గంటలకు పైగా స్విమ్మింగ్ పూల్‌లోని నీరు తోడుతున్నారు. సుమారు రూ.30 లక్షలతో పనులు చేపట్టారు. పూల్ లోపల టైల్స్, వాష్‌రూమ్స్, పూల్‌కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి కోసం 10కిలో వాట్స్ సోలార్ ప్లాంట్, పోటీలు జరిగినప్పుడు వీక్షించేందుకు షెడ్డు నిర్మాణం తదితర పనులు చేస్తున్నారు.
యుద్ధప్రాతిపదికన పనులు
క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చొరవతో స్విమ్మింగ్ పూల్ అభివృద్ధి పనులు చేపట్టాం. నెల రోజుల్లో పూర్తి చేసి స్విమ్మర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నాం.
– గుగులోత్ అశోక్‌కుమార్, డీవైఎస్‌ఓ, హనుమకొండ
●

స్విమ్మింగ్‌పూల్‌కు సెలవు