
మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు
వెంకటాపురం(ఎం)/వాజేడు/వెంకటాపురం(కె)/మంగపేట/గోవిందరావుపేట: మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతూ మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజాప్రంట్ పేరిట జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం కరపత్రాలు వెలిశాయి. కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి ప్రజల జీవన విధానంలో పాత్రులు కావాలని పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ మేరకు వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని బండ్ల పహాడ్, తొర్రి చింతలపాడు, ఊట్ల, చాకలిరేవు గొత్తికోయగూడెంలలో గోడలపై పోస్టర్లను అంటించారు. వాజేడు మండల పరిధిలోని జగన్నాథపురం జంక్షన్, ధర్మపురం, తదితర గ్రామాల్లో కరపత్రాలు అంటించారు. వెంకటాపురం(కె)మండల పరిధిలోని చొక్కాల గ్రామ సమీపంలో కరపత్రాలు వెలిశాయి. మంగపేట మండల పరిధిలోని దోమెడ పంచాయతీ పరిధిలోని పాలాయిగూడెం, తిమ్మారం, రామచంద్రునిపేట గ్రామాల మధ్య, అటవీ ప్రాంతంలోని రాళ్లగుంపు, బ్రాహ్మణపల్లి సమీపంలోని కేశవాపురంతో పాటు గొత్తికోయగూడేల్లోని గుడిసెల గోడలు, గోవిందరావుపేట మండలంలోని గొత్తికోయ గుంపులలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు వెలిశాయి.

మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు