
పరిశుభ్రత పాటించాలి
మరిపెడ రూరల్: నివాస గృహాలు, కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించాలని స్వచ్ఛ సర్వేక్షణ్ మహబూబాబాద్ జిల్లా కోర్డినేటర్ పి. శ్రావణ్ అన్నారు. ఆదివారం మరిపెడ మండలం వీరారం, పురుషోత్తమాయగూడెం గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ భారత్–2025 మిషన్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల గృహాల్లోని మరుగుదొడ్లు, సైడ్ కాల్వలు, కమ్యూనిటీ హాల్స్, హెల్త్ సెంటర్, అంగన్‌వాడీ సెంటర్లు, కార్యాలయాలను బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం శ్రావణ్ మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా ఇప్పటికే ఇంటింటకీ రెండు చెత్త సేకరణ డబ్బాలు ఇవ్వడం జరిగిందన్నారు. తడి, పొడి చెత్తను సేకరించడానికి వాటిని వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్వెస్టిగేషన్ అధికారి రవిచంద్ర పటేల్, మరిపెడ ఎంపీఓ సోమ్లానాయక్, కార్యదర్శిలు రామోజీ, సురేష్, శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ సోమనాయక్, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.